ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది జగనే: అచ్చెన్న

ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది జగనే: అచ్చెన్న

AP: వైసీపీ ప్రభుత్వంలో అంకెల గారడీతో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసానికి రాష్ట్రం బలైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను నాలుగు గోడల మధ్య ప్రెస్‌మీట్‌లు పెట్టి చెప్పడమేంటని జగన్‌ను నిలదీశారు. ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే రూ.3 వేల కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రైతు భరోసా కింద రూ.6 వేలు ఎగ్గొట్టారని మండిపడ్డారు.