ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

SKLM: ఆముదాలవలస మండలం బమ్మిడివానిపేట గ్రామానికి చెందిన పూనా రామారావు (48) పొట్టకూటి కోసం భార్య, పిల్లలతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వెళ్లి ఓ నూలుమిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కుమారుడు మృతి చెందడంతో ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం తాను నివాసం ఉండే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.