రోడ్డు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
SS: అగళి(M) రావుడీ గ్రామంలో రోడ్డు సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు రోడ్డు సమస్యను ప్రస్తావించి, గెలిచిన తర్వాత విస్మరిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామానికి మాత్రం రోడ్డు మంజూరు కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ గ్రామానికి వెంటనే రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.