INSPIRATION: మిల్కా సింగ్

మిల్కా సింగ్ ఓ గొప్ప అథ్లెట్. దేశ విభజన సమయంలో తన కుటుంబాన్ని కోల్పోయిన ఆయన.. చాలా కష్టాలు అనుభవించారు. కానీ పరుగు మీద ఉన్న తన ప్రేమను వదులుకోలేదు. భారత సైన్యంలో చేరి, తన ప్రతిభను చాటుకున్నారు. ఎన్నో అంతర్జాతీయ రేసులలో విజయం సాధించి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా, లక్ష్యంపై దృష్టి పెడితే విజయం సాధించవచ్చు అని ఆయన జీవితం చెబుతుంది.