13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

SKLM: ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో ముగించుకోవచ్చని చెప్పారు. జిల్లా జడ్జీతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.