VIDEO: 'MLA మాధవి భర్తపై తప్పుడు ప్రచారం తగదు'
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ఆమె భర్త రామచంద్రరావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగళవారం రోజున టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. రామచంద్రరావు స్థలం కబ్జా చేశారనే ఆరోపణలు నిరాధారమన్నారు. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారని ,ఈ కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు.