రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
NZB: జక్రాన్ పల్లి మండలం మునిపల్లి శివారులోని NH-63పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తెల్ల షర్ట్, నల్ల ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.