రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

VKB: తాండూరు మండలం కోటబాస్ పల్లి గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాయి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి వడ్డే యాదగిరి (17) అనే బాలుడిని ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రుడిని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.