హెపటైటిస్-బీ వైరస్ గూర్చి మీకు తెలుసా..?
HYD జిల్లాలో నిత్యం రోగుల కోసం విధులు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణగా హెపటైటిస్-బీ వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రాణాంతకమైన ఈ కాలేయ సంబంధిత వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందని, మానవ కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డా.వెంకటి తెలిపారు. వ్యాధి సోకిన వారి రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.