‘పదో తరగతి పరీక్షలకు సన్నాహాలు పూర్తి చేయాలి’
CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.