జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్, సాలూరా, కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో 44.3°C ల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కాగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట 21.8 మి.మీ, సిరికొండ మండలం తూంపల్లి 18.5మి.మీ ల వర్షపాతం రికార్డయింది.