రేపు ఏలేశ్వరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు ఏలేశ్వరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

KKD: ఏలేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ వీరభద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఏలేశ్వరం నగర పంచాయితీ, లింగపర్తి, భద్రవరం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.