రాహుల్ చెప్పకుండా విదేశాలకు వెళ్తున్నారు: CRPF
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతాపరమైన ప్రొటోకాల్ పాటించడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు CRPF లేఖ రాసింది. రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా డిసెంబరులో ఇటలీ, మార్చిలో వియత్నాం, ఏప్రిల్‌లో దుబాయ్, జూన్‌లో ఖతార్, లండన్, సెప్టెంబర్‌లో మలేషియా పర్యటనకు వెళ్లారని ప్రస్తావించింది. CRPF ఎల్లో బుక్ నియమావళిని రాహుల్ పట్టించుకోవడం లేదని పేర్కొంది.