పత్తి పంటను పరిశీలించిన ఏడిఏ

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామ శివారులోని పత్తి పంటలను మంగళవారం ఏడిఏ నూతన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి పైరుకు దోమ తామర పెనుబంక తెగులు ఆశించినప్పుడు పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో హన్మండ్లు, రైతులు తదితరులు ఉన్నారు.