ఎండిపోతున్న హరితహారం మొక్కలు

ఎండిపోతున్న హరితహారం మొక్కలు

GDWL: ఇటిక్యాల మండల వ్యాప్తంగా గతంలో నాటిన హరితహారం మొక్కలు అధ్వాన స్థితికి చేరాయి. అగ్నికి ఆహుతి కావడం, నీటి సరఫరా లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. మొక్కల సంరక్షణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.