కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు

NGKL: బల్మూరు మండలంలోని తోడేళ్లగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకురాలు సంగీత నిరంజన్‌తో పాటు పది మంది నాయకులకు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.