VIDEO: పట్టణంలో వడగళ్ల వాన
GDWL: అయిజ పట్టణంలో బుధవారం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో మొదలైన వాన, చూస్తుండగానే వడగళ్ల వానగా మారింది. గంటకు పైగా కురిసిన ఈ భారీ వర్షంతో పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణ వాసులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది.