మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: డీజీపీ
HYD: మున్సిపల్ ఎన్నికలను చట్టం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. HYD నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీలు, ఎస్పీలు, ఎన్‌హెచ్‌వోలతో మాట్లాడిన డీజీపీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.