రూట్ మార్చిన ట్రంప్.. రష్యాకు భారీ ఆఫర్లు!
ఉక్రెయిన్ యుద్ధానికి శుభం కార్డ్ వేసేందుకు ట్రంప్ రూట్ మార్చారు. ఇన్నాళ్లు ఆంక్షలతో భయపెట్టిన ఆయన.. ఇప్పుడు రష్యాకు ఆఫర్లు ఇస్తున్నారు. యూరప్‌కు రష్యా ఆయిల్ సప్లైకి గ్రీన్ సిగ్నల్, స్తంభింపజేసిన ఆస్తుల రిలీజ్, రష్యా గనుల్లో US పెట్టుబడులు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌తో పుతిన్‌ను కూల్ చేసే పనిలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.