నందవరంలో ముగిసిన వేలం పాట

KRNL: నందవరంలో కమేళా, వారాంతపు సంత మార్కెట్ నిర్వహణకు పంచాయతీ అధికారులు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో సందీప్, సర్పంచ్ తోట సావిత్రి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేలంలో దినసరి మార్కెట్‌ను బాబు హెచ్చుపాడి రూ.1,21,000కు, సంత మార్కెట్‌ను రూ.40,000కు పొందారు. కమేళాను మాత్రం రూ.23,000కు మీసాల శాంతిరాజు దక్కించుకున్నారు.