VIDEO: కనిగిరిలో 'న్యాయ విజ్ఞాన సదస్సు'
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని డీడీవో కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల్లో మార్పు రావాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. న్యాయవాదులు పాల్గొన్నారు.