‘మురుగునీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలి’

NDL: ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని, దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో మురుగునీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.