విజయవాడలో వాహన తనిఖీలు
NTR: రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని మాచవరం సీఐ ప్రకాష్ సూచించారు. గుణదలలో మంగళవారం ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్యూరెన్స్ తదితర పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేనివారికి చలానాలు విధించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.