ప్రతిభావంతులైన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
PLD: నరసరావుపేట లింగంగుంట్లలోని శంకర భారతిపురం పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. SBI వారు తమ CSR ఫండ్స్ ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.