సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
SKLM: సరుబుజ్జిలి మండలం పెద్దపాలెంకి చెందిన జి. చిన్నమ్మడు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.4 లక్షల చెక్కును గురువారం రాత్రి ఎమ్మెల్యే రవికుమార్ ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.