ఉద్రిక్తల నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్

కృష్ణా: పాక్ - భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జిల్లాలో 110 కిమీ సముద్ర తీరం ఉండటంతో ఉగ్రవాదులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మూడు మెరైన్ స్టేషన్ల పరిధిలో 150 మంది సిబ్బంది, ప్రతి తీర గ్రామంలో పహారాతో పాటు డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతోంది.