ఈనెల 6న పుల్లలచెరువు సర్వసభ్య సమావేశం

ఈనెల 6న పుల్లలచెరువు సర్వసభ్య సమావేశం

SKLM: పుల్లలచెరువు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సంజీవరావు తెలిపారు. ఎంపీపీ కందుల వెంకటయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన తెలిపారు. గైర్హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.