VIDEO: మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికులు నిరసన

VIDEO: మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికులు నిరసన

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటుకు సోమవారం మున్సిపల్ కార్మికులు తాళాలు వేసి నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.