సీఎం చంద్రబాబుతో ఎంపీ భేటీ
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన పార్లమెంట్ పరిధిలో పలు రకాల అభివృద్ధి కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. అలాగే ముస్లిం సోదరుల సమస్యలను కూడ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ఆయన తెలిపారు.