పేలిన గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం

KDP: కాజీపేట మండలం సర్వం ఖాన్ పేటలో ఓ ఇంటిలో ఆదివారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలింది. లిండర్ పేలిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇంటిలోని విలువైన సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.