VIDEO: 'జై అమరావతి' నినాదాలతో హోరెత్తిన బుచ్చి
NLR: బుచ్చి పట్టణంలో జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు వైస్ ఛైర్మన్ నస్రీన్, క్లస్టర్ ఇంఛార్జ్ రామానాయుడు ఆధ్వర్యంలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి, కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం హర్షణీయమని కొనియాడారు. ఎన్నో ఏళ్ల కల నేడు సాకారం కావడంతో రాజధాని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.