'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
SKLM: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 16న అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్బలరాం, జిల్లా కార్యదర్శి ఆర్.ప్రకాష్ రావు తెలిపారు. ఇవాళ స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.