17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరిలోని 17వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వాటర్ పైప్‌లైన్ లీకేజ్‌లను పరిశీలించారు. వాటర్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృధాగా పోవడంతో పాటు మురుగునీటితో కలిసి కలుషితమవుతుందని తద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడతారన్నారు. లీకేజ్‌ల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఏఈ మాధవరావును ఆదేశించారు.