సాంకేతిక లోపంతో నిలిచిన పినాకిని ఎక్స్‌ప్రెస్

ప్రకాశం: చెన్నై నుండి విజయవాడ వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సాంకేతిక లోపంతో మంగళవారం రాత్రి వేటపాలెం మండలం కొత్తపందిళ్ళపల్లి వద్ద మూడు గంటలకు పైగా నిలిచిపోయింది. విజయవాడ నుండి రైల్వే అధికారులు మరో ఇంజన్ తెప్పించడంతో ఎట్టకేలకు రైలు కదిలింది. దీనితో పినాకిని మూడు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.