నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు: SP

E.G: గణేష్ నిమజ్జనాలను సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ పోలీసులను బుధవారం సాయంత్రం ఆదేశించారు. SP కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి, తీసుకోవలసిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. డీజేలను అనుమతించరాదని తెలిపారు.