ఫేషియల్ నిర్ధారణతోనే పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

ఫేషియల్ నిర్ధారణతోనే పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

MDK: జిల్లాలో ప్రభుత్వ పెన్షన్ దారులకు ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో మెదక్ పట్టణం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని ఆమె తెలిపారు. పెన్షన్లు పొందుతున్న వారు కార్యాలయాలకు రాకుండా యాప్ ద్వారానే ఈ ధ్రువీకరణ చేసుకోవచ్చని వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.