ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
PPM: కొమరాడ మండలం ఎండబద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఎంపీడీవో ఎస్.రమేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పాఠశాలలో కిటికీలు, తలుపులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఎంపీడీవోకు చెప్పారు. తక్షణమే మరమ్మతులు జరిగేలా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.