VIDEO: కరెన్సీ నోట్ల అలంకరణలో పోరుమామిళ్ల వాసవి మాత

VIDEO: కరెన్సీ నోట్ల అలంకరణలో పోరుమామిళ్ల వాసవి మాత

KDP: పోరుమామిళ్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం దీపావళి సందర్భంగా అమ్మవారిని వివిధ కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. లక్ష్మీ పూజ నిర్వహించిన అనంతరం నరకాసురుడు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన కరెన్సీ నోట్లను వేలంపాట నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.