మానవత్వం చాటుకున్న సీఐ
E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా, కొవ్వూరు CI విశ్వం మానవత్వాన్ని చాటుకున్నారు. దర్శనం కోసం వచ్చి నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ దివ్యాంగురాలిని చూసి చలించిపోయిన ఆయన, అటుగా వెళ్తున్న బైక్‌ను ఆపి, ఆమెను ఆలయం వద్ద దింపాలని సూచించారు. ఈ సంఘటనతో గ్రామస్థులు CI ఉదారతను ప్రశంసించగా, బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది.