తమ పొలాలను రక్షించాలని రైతులు వినతి

NTR: కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రైతులు శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ... గ్రామ పరిధిలో క్వారీలు ఎదురుగా సుమారు 1000 ఎకరాలు పైగా సాగు భూమి ఉందని ఇందులో 300 ఎకరాలు క్వారీల సమీపంలో ఉందన్నారు. క్వారీలలో పేలుడు వలన ఈ పొలాలలో రాళ్లు రప్పలు పడి, పంటలకు నోచుకోని పరిస్థితి ఏర్పడిందన్నారు.