VIDEO: సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మాజీమంత్రి

WGL: శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా రాయపర్తి మండలం కాట్రపల్లి శ్రీరామ మందిరంలో సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో కల్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మార్మోగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.