గోకవరం ఎస్సై హెచ్చరికలు

గోకవరం ఎస్సై హెచ్చరికలు

E.G: గోకవరం దేవిచౌక్ సెంటర్‌లో ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పలు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని రెండు వాహనాలను స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.