VIDEO: మైలవరంలో వృథాగా పోతున్న నీరు
NTR: మైలవరం బంధగరలో గత వారం రోజులుగా పైపుల లీకేజీతో నీళ్లు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీనివల్ల ఇళ్లకు నీరు అందక, వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు.