స్వామివారికి ఇత్తడి మాణిక్యాల బహుకరణ

స్వామివారికి ఇత్తడి మాణిక్యాల బహుకరణ

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయంవ్యక్త శ్రీ వెంకటేశ్వరస్వామి (సన్నూరు) ఆలయానికి వికాస తరంగిణి సేవా బృందం సభ్యులు శుక్రవారం ఇత్తడి మాణిక్యాలను అందజేశారు. స్రవంతి, సుహాసిని, పద్మావతి తదితరులు స్వచ్ఛందంగా నిధులు సేకరించి స్వామివారి కైంకర్యం కోసం 30 జతల మాణిక్యాలను ఆలయానికి సమర్పించారు. ఈ సేవను ఆలయ నిర్వాహకులు, భక్తులు ప్రశంసించారు.