కంపెనీని నిలిపివేయాలని తండవాసులు ధర్నా

కంపెనీని నిలిపివేయాలని తండవాసులు ధర్నా

NGKL: వెల్దండ మండలంలోని నారాయణపూర్ తండాలో నిర్మిస్తున్న కంపెనినీ నిలిపివేయాలని గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. గ్రామంలో బొక్కలను ఉడికించే కంపెనీని నిర్మిస్తే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ప్రభుత్వం స్పందించి కంపెనినీ నిర్మించకుండా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.