తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 18 గంటల సమయం పడుతుండగా.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న 80,113 మంది స్వామిని దర్శించుకోగా.. 31,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లుగా నమోదైంది.