కార్వేటినగరంలో 19న జాబ్ మేళా
CTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న (బుధవారం) కార్వేటినగరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ విజయులు రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలవారు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఇంటర్, డిగ్రీ పాస్ / ఫెయిల్ అయినవారు అర్హులు. వయస్సు 18-35 ఉండాలని ఆయన పేర్కొన్నారు.