సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ జడ్జి

సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ జడ్జి

TG: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. CBI అధికారులమని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడ్డారు. బెంగళూరు ఇందిరానగర్‌లో ఆయనపై కేసు నమోదు అయిందని సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో అతని నుంచి రూ.1.66 కోట్లను కొట్టేశారు.