జైనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
PDPL: జైనాథ్‌లోని పురాతన శ్రీ లక్ష్మినారాయణ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.