సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు

సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు

SDPT: తెలుగువారి అసలైన నూతన సంవత్సరం ఉగాది. షడ్రుచులతో మొదలయ్యే పండుగ సంవత్సరమంతా శుభాలు కలిగిస్తుందని తెలుగువారి నమ్మకం. ఉగాది సందర్భంగా జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, యువతులు సంప్రదాయ పద్దతిలో మామిడి తోటలో ఉగాది పచ్చళ్లు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు.